బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా మొట్ట మొదట పోరాటం మొదలుపెట్టిన వ్యక్తి టిజిఎస్ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీస్ అధికారి విసీ సజ్జనార్. గతంలో ఆయన సైబరాబాద్ సీపీగా ఉన్నప్పుడే బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేయించి వాటిని కట్టడి చేశారు.
ఇటీవల మళ్ళీ వాటి జోరు పెరిగినప్పుడు ముందుగా ఆయనే స్పందించారు. కనుక వీటి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సిట్ బృందంలో ఆయనని కూడా చేర్చాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
ఈరోజు సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీజీపీ జితేందర్, ఇంటలిజన్స్ డీజీ శివధర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖ గోయల్‌టోపాటు వీసీ సజ్జనయర్ కూడా పాల్గొన్నారు.
కనుక ఆయనని ఈ సిట్ బృందంలో సభ్యుడుగా చేర్చడంవ లేదా ఆయన నేతృత్వంలోనే సిట్ ఏర్పాటు చేయడమో జరుగవచ్చు. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడితే సిట్‌లో సజ్జనార్ పాత్ర ఏమిటనేది స్పష్టత వస్తుంది.