శాసనసభలో 30 శాతం కమీషన్ రచ్చ

March 26, 2025


img

నేడు శాసనసభలో కాంగ్రెస్‌ మంత్రులు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. 

కేటీఆర్‌ ఓటుకి నోటు కేసుని ప్రస్తావిస్తూ సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయన కాంగ్రెస్‌ అధిష్టానానికి రూ.50 కోట్లు చెల్లించి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని గతంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన ఆరోపణలను గుర్తుచేసి మాట్లాడటం, కాంగ్రెస్‌ మంత్రులు కాంట్రాక్టర్ల వద్ద నుంచి 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ మాట్లాడిన మాటలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేశారు. 

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కేటీఆర్‌కి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరుపక్షాల సభ్యులు లేచి మాట్లాడుతుండటంతో సభలో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్‌ మంత్రులు కాంట్రాక్టర్ల వద్ద నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారనే కేటీఆర్‌ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని లేకుంటే శాసనసభలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భట్టి విక్రమార్క  డిమాండ్ చేశారు. కేటీఆర్‌ క్షమాపణ చెప్పకపోతే సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు. వారి తీరుకి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకవుట్ చేసి అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద కూర్చొని నినాదాలు చేశారు. 


Related Post