దాదాపు ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరూ ఈ వార్త కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏప్రిల్ 3వ తేదీన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం కూడా ఖరారు అయిన్నట్లు తెలుస్తోంది.
మొత్తం ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగు పదవులకె కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. కనుక ఆ ‘నలుగురు ఎవరు?’ అని ఊహాగానాలు మొదలయ్యాయి.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఈసారి మంత్రి పదవి ఖాయమని అందరికీ చెప్పుకుంటున్నారు.
ఇక సీనియర్ నేతలు మల్ రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు కూడా ఈ రేసులో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి, బీసీ కోటాలో శ్రీహరి ముదిరాజ్ లేదా ఆది శ్రీనివాస్, ఎస్సీ కోటాలో వివేక్ వెంకట స్వామి, మైనార్టీ కోటాలో అమీర్ ఆలీ ఖాన్ పేర్లు ఖరారయిన్నట్లు తెలుస్తోంది.
చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే త్వరలో కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన వెలువడితే తెలుస్తుంది.