మహారాష్ట్రలో బీజేపీ, ఝార్ఖండ్ లో జేఎంఎమ్

November 23, 2024


img

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహరాష్ట్రలో బిజీపీ, శివసేనల మహాయుతి కూటమి గెలిచి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది కానీ ఝార్ఖండ్ ఫలితాలను అంచనా వేయడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి. 

మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉండగా వాటిలో మహాయుతి కూటమి 19 స్థానాలలో ఆధిక్యత సాధించి అధికారం కైవసం చేసుకోబోతున్నాయి. మహారాష్ట్రలో ఈసారి కాంగ్రెస్, మిత్రపక్షాల కూటమి ఎంవీఏ గట్టి పోటీ ఇచ్చిన్నప్పటికీ వాటి కూటమికి 55 సీట్లు (ఆధిక్యత) మాత్రమే వచ్చింది. ఇతరులు 12 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. కనుక మహారాష్ట్రలో మళ్ళీ బీజేపి, శివసేనల కూటమి అధికారంలోకి రావడం ఖాయం అయ్యింది.   

ఝార్ఖండ్ లో మొత్తం 88 సీట్లకు అధికార జేఎంఎమ్ మిత్రపక్షాల కూటమి 52 సీట్ల ఆధిక్యతలో కొనసాగుతుండగా బిజేపీ 28 సీట్ల (అధిక్యత)కి పరిమితం అయ్యింది. ఝార్ఖండ్ ప్రభుత్వం ఏర్పాటుకి 45 సీట్లు అవసరం కాగా జేఎంఎమ్ మిత్రపక్షాల కూటమి 52 సీట్లు గెలుచుకోబోతోంది కనుక అదే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమే.


Related Post