టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా మరణించడంతో ఆయన స్థానంలో నోయల్ టాటా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. టాటా సన్స్ గ్రూపులో మొత్తం 14 ట్రస్టులున్నాయి. అవన్నీ రతన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంటాయి. ఆ రెండు ప్రధాన ట్రస్టు బోర్డు సభ్యులు నేడు ముంబైలో సమావేశమయ్యి రతన్ టాటా వారసుడిగా, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయల్ టాటాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నోయల్ టాటా రతన్ టాటాకి వరుసకి సోదరుడు అవుతారు. గత రెండున్నర ధశాబ్ధాలుగా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలలో టాటా స్ట్రీల్స్, టాటా ఇన్వెస్ట్ మెంట్స్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్, టైటాన్ కంపెనీలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
రతన్ టాటా ట్రస్టులో సభ్యుడుగా కూడా ఉన్నారు. టాటా కంపెనీల ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా నోయల్ టాటా పనిచేస్తారనే మంచి పేరుంది. కనుకనే రతన్ టాటా వారసుడిగా టాటా గ్రూప్ సంస్థలన్నిటికీ సారధ్యం వహించే అవకాశం లభించింది.