తెలంగాణ ప్రభుత్వం ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారారాయణ రావు పేరిట సాహిత్య రంగంలో ప్రముఖులకు ఏటా అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. కనుక 2024లో ఈ అవార్డుకి సాహిత్యవేత్తని ఎంపిక చేసేందుకు ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రముఖ కవి అందెశ్రీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రముఖ సాహితీవేత్తలు ఏనుగు నర్సింహారెడ్డి గారు, సంగనభట్ల నర్సయ్య గారు, పొట్లపల్లి శ్రీనివాస్ సభ్యులుగా, మామిడి హరికృష్ణ సమన్వయకర్తగా ఉంటారని జీవోలో పేర్కొంది.
ఈ అవార్డుకి ఎంపికైనవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘కాళోజీ నారాయణ రావు అవార్డు’తో సన్మానించి, జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదు బహుమతిని అందజేస్తారు.