తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా చిన్నా రెడ్డి

February 25, 2024


img

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడుగా నియమితులయ్యారు. సీనియర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ యూనియన్ లీడర్ కె.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

చిన్నారెడ్డి 1977 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వనపర్తి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2007-09 మద్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు వనపర్తి నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఇచ్చింది కానీ చివరి నిమిషంలో వేరేవారికి ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సముచిత పదవి, గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారమే క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన ఈ పదవిని చిన్నారెడ్డికి ఇచ్చింది.


Related Post