తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణ (పిఆర్‌సీ) కమిటీ నియామకానికి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత పిఆర్‌సీ గడువు జూన్ 30తో ముగిసినందున అప్పటి నుంచి కొత్త పిఆర్‌సీ కోసం ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కొత్త పిఆర్‌సీ కమిటీకి ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్, సభ్యుడుగా బి.రామయ్యలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఆరు నెలల్లోగా తమ నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించింది. ఈ కమిటీ నిర్వహణ కొరకు అవసరమైన నిధులు, సిబ్బందిని తక్షణం సమకూర్చాలని ఆర్ధికశాఖ ఆదేశించింది.
ఈ పిఆర్‌సీ కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించేలోగా అక్టోబర్ 1వ తేదీ నుంచే ఉద్యోగుల మూలవేతనంలో 5శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ధికశాఖ మరో ఉత్తర్వు నిన్ననే జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ, పించన్‌దారులకు, స్థానిక సంస్థలలో పనిచేస్తున్నఉద్యోగులకు, ప్రభుత్వ గ్రాంటులతో నడిచే సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు, వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులకు ఈ ఐఆర్ వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొంది.
రాష్ట్రంలో మొత్తం 3 లక్షల మంది ఉద్యోగులు, మరో 3 లక్షల మందిపించన్‌దారులున్నారు. వారందరికీ 5% ఐఆర్ చెల్లించడానికి ప్రభుత్వంపై ఏడాదికి రూ.2,000 కోట్లు అదనపు భారం పడబోతోంది.
ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
— Harish Rao Thanneeru (@BRSHarish) October 2, 2023
9 ఏళ్లలో రెండు పిఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పిఆర్సీని… pic.twitter.com/THTXpPFKPL