జానారెడ్డి అలకపాన్పు ఎక్కారట!

September 29, 2023


img

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నాయకుడు, 2014 ఎన్నికలలో అన్నీ కలిసి వచ్చి ఉంటే ముఖ్యమంత్రి కూడా అయ్యుండేవారు. కానీ 2021, మేలో జరిగిన సాగర్ ఉపఎన్నికలలో జానారెడ్డి పెద్దగా రాజకీయ అనుభవం లేని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి నోముల భగత్ చేతిలో ఓడిపోయారు.

అంతకు ముందు నుంచే రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న జానారెడ్డి ఆ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా దూరమైపోయారు. కానీ పార్టీని వీడలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జానారెడ్డి మళ్ళీ యాక్టివ్‌ అయ్యారు.

ఐతే ఈసారి సాగర్ నుంచి తనకు బదులు తన కుమారుడు జైవీర్ రెడ్డిని బరిలో దింపాలనుకొంటున్నారు. తన రెండో కొడుకు రాఘువీర్ రెడ్డికి కూడా మిర్యాలగూడా సీటుని ఇవ్వాలని కోరారు. కానీ అందుకు కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించకపోవడంతో జానారెడ్డి అలకపాన్పు ఎక్కిన్నట్లు తెలుస్తోంది.

కొత్తగా పార్టీలో చేర్చుకొన్న పొంగులేటి, జూపల్లి, మైనంపల్లి హన్మంతరావు వంటివారికి అడిగినన్ని టికెట్లు ఇస్తూ, దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న తనకు మరొక్క టికెట్ ఇవ్వలేరా? అని జానారెడ్డి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిజమే కదా?


Related Post