నేడు శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు జన్మించిన రోజు. కులమత భాషా ప్రాంతాలకు అతీతంగా సర్వమానవాళికి తన భగవద్గీత ద్వారా ఉత్తమ జీవనవిధానం గురించి తెలియజేశాడు. అటువంటి శ్రీకృష్ణుడి గురించి మనకు తెలిసినది చాలా తక్కువే. ఆయన పుట్టుక మొదలు నిర్యాణం వరకు ఆయన జీవితానికి సంబందించిన వివరాలు తెలుసుకోవాలనుకోగలిగితే అదృష్టమే కదా? శ్రీకృష్ణుడి జీవిత విశేషాలు మీ కోసం...
• . శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు.
• పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C).
• మాసం : శ్రావణం, తిథి: అష్టమి, నక్షత్రం : రోహిణి, వారం : బుధవారం.
• జన్మ సమయం : రాత్రి గం.00.00 ని.లకు.
• జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు.
• నిర్యాణం: క్రీ పూ 18.02.3102 (3102 B.C).
• శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది.
• కురుక్షేత్రం జరిగిన 36సం.ల తరువాత నిర్యాణం.
• కురుక్షేత్రం ప్రారంభం: క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు.
• కురుక్షేత్రం ముగిసిన రోజు: 25.12.3139
• క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
• భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
• శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. మధురలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాధ్, మహారాష్ట్రలో విఠల (విఠోబ), రాజస్తాన్‌లో శ్రీనాధుడు, గుజరాత్‌లో ద్వారకాదీసుడు మరియు రాంచ్చోడ్, ఉడిపి, కర్ణాటకలో కృష్ణ.
• శ్రీకృషుడికి జన్మనిచ్చిన తల్లితండ్రులు: వసుదేవుడు, దేవకీ దేవి.
• పెంచిన తల్లితండ్రులు: యశోద, నందుడు.
• సోదరుడు: బలరాముడు; సోదరి సుభద్ర. వీరి జన్మ స్థలం: మధుర
• శ్రీకృష్ణుడి భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ.
• శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : చాణుర (కుస్తీదారు); కంసుడు (మేనమామ), శిశుపాలుడు మరియు దంతవక్ర (అత్త కొడుకులు).
• శ్రీకృష్ణుని వంశం: తల్లి ఉగ్ర వంశం, తండ్రి యాదవ వంశం.
• శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
• కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనంకి మారవలసి వచ్చింది.
• శ్రీకృష్ణుడు 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. ఆ వయసులోనే మేనమామ కంసుడిని మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులకు చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
• ఆ తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళీ ఎప్పుడూ తన జీవితకాలంలో బృందావనానికి తిరిగి రాలేదు.
• కాలయవన అను సింధూరాజు నుంచి ముప్పు ఉండటంతో మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
• వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
• శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
• అప్పుడు విద్యాభ్యాసం కొరకు (16-18 ఏళ్ల వయసులో) ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను. గుజరాత్‌లోని ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురైన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడెను.
• తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
• పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.
• ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
• రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
• పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
• అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
• శ్రీకృష్ణుడు జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
• జీవితంలో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికీ, ఎవరికీ అంకితమవ్వలేదు. శ్రీకృష్ణుడు తన గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు కానీ ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.
• (సేకరణ)