దేశంలో మంకీపాక్స్ కలకలం... మార్గదర్శకాలు జారీ

August 03, 2022
img

భారత్‌లో ఓ వైపు కరోనా మహమ్మారి చాప కింద నీరులా మెల్లగా వ్యాపిస్తుంటే, మరోపక్క దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మంకీపాక్స్ వ్యాధితో ఒక వ్యక్తి చనిపోగా, దేశంలో 8 మందికి ఈ వ్యాధి సోకింది. మశూచిని పోలి ఉండే మంకీపాక్స్‌ వ్యాధి ప్రాణాంతకం కాదు కానీ అజాగ్రత్తగా ఉంటే చాలా వేగంగా ఇతరులకు వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంకీపాక్స్‌ కట్టడికి ఈరోజు మార్గదర్శకాలు జారీ చేసింది. 

చేయాల్సినవి: మంకీపాక్స్‌ వ్యాధి సోకినవారిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలి. వ్యాధి సోకినవారు తప్పనిసరిగా మూడు లేయర్లు కలిగిన మాస్కులు, శరీరంపై దద్దుర్లను కప్పి ఉంచే విధంగా బట్టలు ధరించాలి. కుటుంబ సభ్యులు లేదా ఇతరులు వారికి సమీపంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు,  గ్లౌజు ధరించాలి. ఆ తరువాత శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వ్యక్తిగత, పరిసర శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. 

చేయకూడనివి: మంకీపాక్స్ రోగులు ఉపయోగించిన దుస్తులు, తువ్వాళ్ళు, దుప్పట్లు కుటుంబంలో మిగిలినవారు వాడకూడదు. వారి బట్టలతో కలిపి ఉతకకూడదు. పూర్తి జాగ్రత్తలు పాటిస్తూ వాటిని వేరేగా ఉతకాలి. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే బహిరంగ ప్రదేశాలలో తిరగకూడదు. 

Related Post