కోఠీ ఈఎన్టీ ఆసుపత్రికి 24 బ్లాక్ ఫంగస్ కేసులు

May 18, 2021
img

ఓ పక్క కరోనా మహమ్మారి పీడిస్తుంటే కొత్తగా బ్లాక్ ఫంగస్ వ్యాది కూడా ప్రజలను పీడించడం మొదలుపెట్టింది. దీనికి చికిత్స అందించేందుకు హైదరాబాద్‌, కోఠీ ఈఎన్టీ ఆసుపత్రిని నోడల్ ఆసుపత్రిగా ప్రకటించి ముందే ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటిరోజునే 8 మంది మర్నాడు అంటే సోమవారం మరో 16 మంది బ్లాక్ ఫంగస్ రోగులు ఆసుపత్రిలో చేరారు. వారిలో 24 మంది కరోనా నుంచి కోలుకొన్నవారే కావడం గమనార్హం.మోహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఇప్పటివరకు 14 మంది బ్లాక్ ఫంగస్ రోగులు చేరగా వైద్యులు వారందరికీ చికిత్స చేశారు. 

ఈ బ్లాక్ ఫంగస్ బాధితులలో ప్రధానంగా కరోనా వైరస్ వచ్చి కోలుకొన్నవారు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు (షుగర్ పేషంట్లు), శస్త్రచికిత్సలు చేయించుకొన్నవారు ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. గాలిలో ఉండే ఓ రకమైన మ్యూకస్ వైరస్ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటే కన్ను, ముక్కు భాగాలలోకి చొచ్చుకుపోయి గుల్లచేస్తుందని వైద్యులు చెపుతున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే కొన్నిజిల్లాలలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. కనుక ప్రజలందరూ మంచి ఆహారం తీసుకొని రోగనిరోధకశక్తి పెంచుకొంటూ వీలైనంతవరకు ఇళ్లలోనే ఉండటం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్ళవలసివస్తే మొహానికిరెండు మాస్కులు ధరించి, చేతులు శానిటైజ్ చేసుకొని భౌతికదూరం పాటించడం చాలా అవసరం. 

Related Post