వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి: ప్రధాని మోడీ

May 07, 2021
img

ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉన్నతాధికారులతో సమావేశమై దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 12 రాష్ట్రాల పరిస్థితిపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ వారికి పలు సూచనలు చేశారు.

• అన్ని రాష్ట్రాలలో కరోనా వాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మరిన్ని ఎక్కువ వాక్సిన్ డోసులను సరఫరా చేయాలి. వాక్సిన్ వృధాను అరికట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. 

• కరోనా చికిత్సకు అవసరమైన మందుల ఉత్పత్తి, సరఫరాను మరింత మెరుగుపరచాలి. 

• కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వాటికి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందజేయాలి. 

ప్రధాని నరేంద్రమోడీ నిన్న ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, పుదుచ్చేరిలెఫ్టినెంట్ గవర్నర్లతో నేరుగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన మందులు, వాక్సిన్లు, ఆక్సిజన్ వగైరాలన్నీ వీలైనంత త్వరగా అందేలా చేస్తానని వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Post