ప్రైవేట్ యూనివర్సిటీలపై మంత్రి సబిత వివరణ

September 15, 2020
img

తెలంగాణలోప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. ఆ సందర్భంగా ఆ బిల్లుపై జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానాలు చెప్పారు. 

• ప్రైవేట్ యూనివర్సిటీలను గ్రీన్‌ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అనే రెండు కేటగిరీలుగా ఉంటాయి.  

• ఇప్పటికే విద్యార్దులున్న ప్రైవేట్ కాలేజీలను బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీలుగా మార్పు చేయబడతాయి. వాటిలో ఏర్పాటుచేయబోయే యూనివర్సిటీలలో ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉండే నియమనిబందనలే ఉంటాయి. 

• కొత్తగా ఏర్పాటు చేయబోయే వాటిని గ్రీన్‌ ఫీల్డ్ యూనివర్సిటీలుగా పరిగణించబడతాయి. 

• గ్రీన్‌ ఫీల్డ్ యూనివర్సిటీలలో ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఉండదు. ఆ యూనివర్సిటీల నిబందనల ప్రకారమే విధివిధానాలు, ఫీజులు వగైరా ఉంటాయి. 

• రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి 16 సంస్థలు ముందుకు వచ్చాయి. 

• మొదటిదశలో మల్లారెడ్డి, అనురాగ్, ఎస్ఆర్, హోస్టన్, మహీంద్ర సంస్థలకు యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేశాం. 

రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా గట్టిగా కృషి చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. త్వరలోనే అన్ని యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్సిలర్స్ ను నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు.

Related Post