తెలంగాణలో మరో 5,348 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌

March 20, 2024
img

తెలంగాణలో మరో 5,348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్ధికశాఖ అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం, ఆయుష్, ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రి, డీఎంఈ,  డీసీఏ, ఐపిఎం విభాగాలలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంది.

వీటిని వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఆయా విభాగాల అధిపతులు ఈ ఉద్యోగాలకు అర్హతలు, వయో పరిమితి, స్థానికత, రోస్టర్ పాయింట్స్ వగైరా నిర్ణయిస్తారు. వాటి ఆధారం నోటిఫికేషన్‌ జారీ చేసి ఈ ఖాళీల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఒకవేళ ఈ భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ చేయాలనుకుంటే ముందుగా ఎన్నికల సంఘానికి తెలియజేసి అనుమతి పొందవలసి ఉంటుంది.

లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మే 17న జరగాల్సిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) పరీక్ష మే 24కి వాయిదా వేసిన్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అయితే దీని కోసం ఏప్రిల్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏప్రిల్‌ 24వరకు రూ.100, ఏప్రిల్‌ 26 వరకు రూ.300 ఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పించవచ్చు. 

Related Post