తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే...

April 14, 2024
img

తెలంగాణ ఇంటర్ పరీక్ష ప్రధమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు వీలైతే ఒకేసారి ఈ నెల 22న ప్రకటించబోతున్నట్లు ఇంటర్ బోర్డ్ అధికారులు తెలియజేషారు. ఒకవేళ ఆరోజు సాధ్యపడకపోతే ఏప్రిల్‌ 25లోగా ఫలితాలు ప్రకటిస్తామని తెలియజేశారు.

ఫిబ్రవరిలో నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9 లక్షలు పైగా విద్యార్దులు హాజరయ్యారు. వారిలో ఇంటర్ ప్రధమ విద్యార్దులు 4,78,527 కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్దులు 4,43,993 మంది ఉన్నారు.

ఒక్కో పరీక్ష పూర్తవగానే మూల్యాంకనం చేయించడం వలన ఏప్రిల్‌ 10వ తేదీకే పూర్తయింది. కానీ మూల్యాంకనంలో ఎటువంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో మరోసారి మూల్యాంకనం చేయిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు.

గత రెండేళ్ళలో ఇంటర్ ఫలితాలు వెలువడినప్పుడు మూల్యాంకనంలో లోపాల కారణంగా విద్యార్దులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కొంతమంది విద్యార్దులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. కనుక ఇంటర్ బోర్డ్ అధికారులు ఈసారి ఎటువంటి లోపాలు, పొరపాట్లు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

Related Post