తెలంగాణ గ్రూప్-1, 2,3 పరీక్షల షెడ్యూల్ జారీ

March 06, 2024
img

తెలంగాణలో నిరుద్యోగులకు ఓ శుభవార్త. వారు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న గ్రూప్-1, 2 పరీక్షలకు టిఎస్‌పీఎస్సీ నేడు షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం గ్రూప్-1, 2,3 పరీక్షల షెడ్యూల్ ఈవిదంగా ఉంటుంది.

గ్రూప్-1 ఉద్యోగాలకు ఈ నెల 14వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇదివరకు దరఖాస్తు చేసుకున్నవారు మళ్ళీ చేసుకొనవసరం లేదు. మళ్ళీ ఫీజ్ చెల్లించనవసరం లేదు. గ్రూప్-2లో 783 పోస్టులకు ఏకంగా 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, గ్రూప్-3లో 1,388 పోస్టులకు కూడా 5 లక్షలకు పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

  


Related Post