మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సిఎం రేవంత్‌ రెడ్డి

February 29, 2024
img

గాణలో నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీని గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. గత ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌ 6న 5,089 ఉపాద్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది కానీ ఎన్నికల కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం ఆ పాత నోటిఫికేషన్‌ని రద్దు చేసి మరో 5,973 పోస్టులతో కలిపి మొత్తం 11,062 పోస్టులకు నేడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

వీటికి మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజ్ రూ.1,000గా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో డీఎస్సీకి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకొనవసరం లేదు. ఎటువంటి ఫీజ్ చెల్లించనవసరం లేదని, వారందరినీ కూడా ఈ పరీక్షలకు అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌ చెప్పారు. త్వరలోనే ఈ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 11 చోట్ల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 

మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు: 


Related Post