తెలంగాణ ఇంటర్ ద్వితీయ విద్యార్దులకు శుభవార్త

September 08, 2020
img

తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులకు ఓ శుభవార్త. ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షలు వ్రాసి ఫెయిల్ అయినవారు, వివిద కారణాల చేత హాజరుకాలేకపోయినవారు 27,000 మంది కలిపి సుమారు 1.47 లక్షల మంది విద్యార్దులున్నారు. వారందరికీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించవలసి ఉండగా కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసి ఫెయిల్ అయినవారినందరినీ పాస్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న ప్రకటించింది. ఇక మిగిలిన 27,000 మంది విద్యార్దులను కూడా ప్రభుత్వం సూచన మేరకు కనీస మార్కులు ఇచ్చి పాస్ చేయాలనే ఇంటర్ బోర్డు చేసిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినందునట్లు సమాచారం. కనుక ఇంటర్ బోర్డు ఈ మేరకు ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. 


Related Post