సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా పోస్టర్ అదుర్స్!

April 03, 2026


img

యువనటుడు సాయి దుర్గతేజ తన 19వ సినిమాని ప్రకటిస్తూ ఓ అద్భుతమైన పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకి సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు. వారి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ పిక్చర్ బ్యానర్‌పై సాహుగారపాటి ఈ సినిమా నిర్మించబోతున్నట్లు పోస్టర్లో తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి వివరాలు ప్రకటించనున్నారు. 

సాయి దుర్గ తేజ్ హీరోగా చేసిన ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా గత ఏడాది అక్టోబర్లో విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాల వలన ఇంతవరకు విడుదల కాలేదు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాగానే ఈ కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నారు.  

రాయలసీమ నేపధ్యంలో తీస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ లో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్‌, అనన్య నాగళ్ళ ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రోహిత్ కేపీ; సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్; కెమెరా: వట్రివేల్ పళనిసామి; ఎడిటింగ్: నవీన్ విజయ్ కృష్ణ చేశారు.     

ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమాని కె నిరంజన్ రెడ్డి, చాతన్య రెడ్డి కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 


Related Post