అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఎస్ సరస్వతి

April 03, 2026


img

వరలక్ష్మి శరత్ కుమార్‌ స్వీయదర్శకత్వంలో ‘ఎస్ సరస్వతి’ గత నెల థియేటర్లలో విడుదలై ప్రశంశలు అందుకుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రసారమవుతోంది. 

ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ సినిమాలో జీవా, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మురళీ శర్మ, రావు రమేష్ ముఖ్యపాత్రలు చేశారు.   

క్లుప్తంగా కథ: లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్‌) తన పాప ‘ఎస్ సరస్వతి’ని ఆగస్ట్ 15వ తేదీన స్కూల్లో దిగబెట్టి డ్యూటీకి వెళ్ళిపోతుంది. డ్యూటీ నుంచి తిరిగి వచ్చి పాప గురించి అడిగితే ఆ స్కూల్లో, ఆ తరగతిలో ఆ పేరుగల విద్యార్ధిని ఎవరూ లేరని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. 

తన కుమార్తెను ముగ్గురు వ్యక్తులు హత్యాచారం చేసి స్కూల్లో ఓ చోట పాతిపెట్టారని పోలీసులకు పిర్యాదు ఇస్తుంది. అక్కడ తవ్వి చూస్తే పాప శవం ఉండదు. దాంతో పోలీసులు కేసు నమోదు చేయరు. 

తర్వాత ఆమె న్యాయవాది రామానుజం (ప్రకాష్ రాజ్) ద్వారా కోర్టులో న్యాయపోరాటం చేస్తుంది. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు కొట్టేస్తారు. 

తన పాప చావుకి ఓ జడ్జి, ఓ ఐఏఎస్ అధికారి, ఓ పోలీస్ కారణమంటూ ముగ్గురినీ లక్ష్మి హత్య చేస్తుంది. పాప చావుకి కారణం వారేనా కాదా? అనేది సినిమా చూసి తెలుసుకుంటే బాగుంటుంది. 



Related Post