ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్!

March 27, 2024
img

దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ఏప్రిల్‌ 1 నుంచి చిన్నపాటి షాక్ ఇవ్వబోతోంది. అన్ని రకాల డెబిట్ కార్డ్ సర్వీస్ ఛార్జీలపై రూ.75లు చొప్పున పెంచబోతోంది. ఈ పెంపుపై కూడా జీఎస్టీ బాదుడు ఉంటుంది. 

క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై ప్రస్తుతం ఏడాదికి రూ.125 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి రూ.200 ప్లస్ జీఎస్టీ వసూలు చేయబోతోంది.

యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డుల చార్జీలను రూ.175 నుంచి 250 ప్లస్ జీఎస్టీ వసూలు చేయబోతోంది. ప్లాటినం కార్డు చార్జీలను రూ.250 నుంచి రూ.325 ప్లస్ జీఎస్టీ వసూలు చేయబోతోంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. 

Related Post