భారత్‌లో ఎయిర్ టాక్సీలు వచ్చేస్తున్నాయి

April 20, 2024
img

భారతీయులకు విమాన ప్రయాణాలు కొత్తేమీ కాదు. అలాగే రాజకీయ నాయకులు హెలికాఫ్టర్లు బాగానే వాడుతుంటారు. కానీ భారత్‌లో ఇంతవరకు ఎయిర్ టాక్సీ సర్వీసులు ప్రారంభం కాలేదు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారత్‌లో ఎయిర్ టాక్సీ సర్వీసులు 2026 నుంచి ప్రారంభించబోతోందని దాని మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్‌ప్రైజస్ శుక్రవారం ఢిల్లీలో ప్రకటించింది. 

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డ్రోన్ టెక్నాలజీతోనే ఈ ఎయిర్ టాక్సీలు కూడా రూపొందించారు. ఇవి కూడా విద్యుత్ వాహనాలే కావడం మరో విశేషం. ఇంటర్ గ్లోబ్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ భారత్‌ కోసం రూ.8,300 కోట్లు వ్యయంతో 200 ఎయిర్ టాక్సీలను ఏర్పాటు చేయబోతోంది. 

వీటిలో పైలట్ కాకుండా నలుగురు ప్రయాణించవచ్చునని తెలిపింది. ఇవి నిలువుగా కిందకు దిగి, పైకి లేస్తాయి కనుక ఎటువంటి రన్ వే అవసరం ఉండదని కనుక ఎక్కడైనా ల్యాండ్ అవ్వొచ్చు ఎక్కడి నుంచైనా పైకి లేచి గాల్లో ప్రయాణించగలవు. 

వీటిలో 27 కిమీ దూరం చేరుకోవడానికి సుమారు 6-7 నిమిషాలు పడుతుంది. ఈ ప్రయాణానికి ఛార్జీ సుమారుగా రూ.2,000-3,000 వరకు ఉండవచ్చని ఇంటర్ గ్లోబ్ ఎంటర్‌ప్రైజస్ తెలిపింది. 

ముందుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలలో ఈ ఎయిర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించేందుకు ఇంటర్ గ్లోబ్ ఎంటర్‌ప్రైజస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. 

Related Post