మహేశ్వరంలో రూ.250 కోట్లతో ఎలక్ట్రానిక్ ప్లాంట్

April 06, 2024
img

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఈ-సిటీలో మివి ఎలక్ట్రానిక్ సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడితో ఓ ఆడియో ఎలక్ట్రానిక్ పరికరాల ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి శుక్రవారం భూమిపూజ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సీఈవో విశ్వనాధ్ కండుల, రాష్ట్ర ఐ‌టి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్‌ఐఐసీ వైస్ ఛైర్మన్‌ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. 

ఈ సందర్భంగా జయేష్ రంజన్ మీడియాకు ఈ సంస్థ గురించి తెలియజేస్తూ, మన దేశంలో చాలా కంపెనీలు ఇతర దేశాలలో తయారైన ఎలక్ట్రానిక్, ఆడియో పరికరాల విడిభాగాలను దిగుమతి చేసుకొని ఇక్కడ వాటిని అసెంబ్లీ చేస్తుంటాయి. కానీ మివి సంస్థ మాత్రం తమ ఎలక్ట్రానిక్, ఆడియో పరికరాలన్నిటినీ ఇక్కడే తయారుచేస్తుంది.

ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తుంది,” అని చెప్పారు.

Related Post