తెలంగాణకు రూ.6,000 కోట్ల భారీ పెట్టుబడి

February 20, 2024
img

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామికాభివృద్ధి కుంటుపడుతుందనే అపోహలు, అనుమానాలకు సిఎం రేవంత్‌ రెడ్డి దావోస్ పర్యటనతోనే చెక్ పెట్టారు. ప్రభుత్వం మారినా పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో ఎటువంటి మార్పు ఉండబోదని, గత ప్రభుత్వం అమలుచేసిన విధానాల కంటే మరింత మెరుగైన విధానాలు, ప్రోత్సాహకాలతో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తామని తెలియజేస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. 

రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సమక్షంలో సోమవారం రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.6,000 కోట్ల భారీ పెట్టుబడికి ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఐ‌టి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. 

ఈ పెట్టుబడితో రెన్యూసిస్ సంస్థ తెలంగాణలో సోలార్ పీవీ మాడ్యూల్స్, పీవీ సెల్స్ తయారుచేసే భారీ పరిశ్రమని ఏర్పాటుచేస్తుంది. రెన్యూసిస్ సంస్థకు ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో వీటిని తయారుచేసే పరిశ్రమలు ఉన్నాయి. తెలంగాణలో ఏర్పాటు కాబోతున్న ఈ పరిశ్రమ వాటి కంటే చాలా పెద్దదని, ఈ పరిశ్రమతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.

Related Post