హైదరాబాద్‌లో భూగర్భ మెట్రో రైల్వే లైన్!

November 30, 2022
img

హైదరాబాద్‌లో మెట్రో రైళ్ళన్నీ పిల్లర్ల మీద నిర్మించిన రైల్వే ట్రాక్‌లపైనే తిరుగుతున్నాయి. ఇప్పుడు భూగర్భలైన్ (అండర్ గ్రౌండ్) కూడా రాబోతోంది. హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, ఎల్‌ & టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ సంస్థ ఎండీ, సీఈఓ కెవీబీ రెడ్డి ఈ విషయం నిన్న ప్రకటించారు. హైదరాబాద్‌ మెట్రో ప్రారంభం అయ్యి నిన్నటికి 5 సం.లు పూర్తయిన సందర్భంగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్లో జరిగిన వేడుకలలో పాల్గొన్న వారు మెట్రోకి సంబందించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అమీర్ పేట్ మెట్రో స్టేషన్లో తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు కూడా జరిగాయి. 

ప్రస్తుతం అన్ని మార్గాలలో కలిపి రోజుకి 4.40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో అన్ని మార్గాలలో కలిపి మొత్తం 31 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించారు. 

మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిమీ మెట్రో లైన్ నిర్మింస్తాం. దీనిలో విమానాశ్రయం సమీపంలో సుమారు 2.5కిమీ మేర భూగర్భంలో నిర్మిస్తాం.

ఈ పనులకు సిఎం కేసీఆర్‌ డిసెంబర్‌ 9న శంకుస్థాపన చేస్తారు.

ఈ కారిడార్ నిర్మించేందుకు అయ్యే రూ.6,250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 

రాయదుర్గం-శంషాబాద్, నాగోల్-ఎల్‌బీ నగర్‌ మార్గం కూడా అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆకాంక్షించారు.  

ఈ సందర్భంగా ఎన్‌వీఎస్ రెడ్డి, కేవీబి రెడ్డి మెట్రో ప్రయాణికులకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌ మెట్రోని అదరిస్తూ విజయవంతంగా నడిచేందుకు తోడ్పడుతున్న మెట్రో ప్రయాణికులకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.



Related Post