గ్యాస్ బండ బాదుడు తీరే వేరయా!

June 15, 2022
img

గ్యాస్ సిలిండర్‌ ధరల పెంపు కొరకు ఆయిల్ కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ సారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ ధరలను పెంచుతాయి. మరోసారి వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్‌ ధరలు పెంచుతాయి. ఒకటి రెండు రూపాయలు సబ్సీడీని ఎత్తివేసి ఆ మేరకు భారం తగ్గించుకొన్నాయి. ఇప్పుడు 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ డిపాజిట్ ఛార్జీని రూ.1,450 నుంచి ఏకంగా రూ.2,200కి పెంచుతునట్లు ప్రకటించాయి. అదేవిదంగా 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ డిపాజిట్ చార్జీని రూ.800 నుంచి రూ.1,150కి పెంచేశాయి. పెంచిన ఈ ఛార్జీలు నేటి నుంచే అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. ఈ డిపాజిట్ ఛార్జీలు కొత్తగా గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకోనవారికి మాత్రమే వర్తిస్తాయని చెప్పడం పాత వినియోగదారులకు చాలా ఊరటనిచ్చే విషయమే. లేకుంటే తప్పనిసరిగా చెల్లించాల్సి వచ్చేది. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ పెంపు వర్తించదని తెలిపాయి.

Related Post