ప్లాట్‌ఫారం టికెట్ ధర తగ్గింది

July 27, 2021
img

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో రైల్వేస్టేషన్‌లలో జనం రద్దీ తగ్గించాలని ఉద్దేశ్యంతో ప్లాట్‌ఫారం టికెట్ ధరను రూ.50 పెంచింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతుండటంతో అన్ రిజర్వుడ్, సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తిరిగి పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది కనుక ప్లాట్‌ఫారం టికెట్ ధరను రూ.10కి తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే  నిర్ణయం తీసుకుంది. ఇది సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లకు వర్తిస్తుంది. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో మాత్రం ప్లాట్‌ఫారం టికెట్ ధర రూ.20గా ఉంటుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.


Related Post