నేటి నుంచి అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు షురూ

June 21, 2021
img

రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో నేటి నుంచి ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మద్య అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు త్వరలో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఏపీకి బస్సులు నడవడం మొదలయ్యాయి.ముందుగా బాగా డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడిపిస్తామని ఆ తరువాత క్రమంగా అన్ని రూట్లలో నడిపిస్తామని టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. నేటి నుంచి కర్ణాటకలో ఒక్క బెంగళూరు మినహా మిగిలిన ప్రాంతాలకు బస్సులు నడిపిస్తామని తెలిపారు. మహారాష్ట్రాలో కూడా కరోనా తీవ్రత తగ్గడంతో ఆ రాష్ట్రంలో కూడా కర్ఫ్యూ ఆంక్షలు సడలించడంతో మంగళవారం నుంచి మహారాష్ట్రకు కూడా టీఎస్‌ఆర్టీసీ బస్ సర్వీసులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది కూడా విధిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.  

Related Post