రంగారెడ్డి జిల్లాలో రూ.250 కోట్లు వ్యయంతో మెగా డెయిరీ ఫారం

April 19, 2021
img

రంగారెడ్డి జిల్లాలో రూ.250 కోట్లు వ్యయంతో ఓ మెగా డెయిరీ ఫారం త్వరలో ఏర్పాటు కాబోతోంది. జిల్లాలోని మామిడిపల్లిలో 55 ఎకరాల విస్తీర్ణం ఏర్పాటు కాబోతున్న ఈ మెగా డెయిరీలో రూ.18.50 కోట్లు వ్యయంతో పశు పరిశోధనా కేంద్రం, కృత్రిమ గర్భధారణ కేంద్రం కూడా ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో శంఖుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

రాష్ట్రంలో చేపలు, గొర్రెలు, మేకల పెంపకంతో పాటు పాడిపరిశ్రమను కూడా సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు, ఆదాయం పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గొల్ల కురుముల వద్ద సుమారు 2 కోట్లు గొర్రెలున్నాయని చెప్పారు. దీంతో వారు ఆర్ధికంగా నిలద్రొక్కుకోవడమే కాకుండా, మాంస ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలుస్తోందని చెప్పారు. 

గొర్రెలు, మేకల కోసమే ప్రత్యేకంగా రాష్ట్రంలో నల్గొండ, సిద్ధిపేట జిల్లాలో ‘షీప్ మార్కెట్స్’ ఏర్పాటు చేశామని, త్వరలో ఖమ్మం, వనపర్తిలో కూడ ఒక్కోటి రూ.25 లక్షల వ్యయంతో రెండు మార్కెట్లను నిర్మించబోతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తెలిపారు.  

Related Post