కరోనా కట్టడికి ప్లాట్‌ఫారం టికెట్ ధర పెంపు!

March 03, 2021
img

మహారాష్ట్రలో...ముఖ్యంగా జనసమర్ధం చాలా ఎక్కువగా ఉండే ముంబై మహానగరంలో మళ్ళీ కరోనా తీవ్రత పెరుగుతుండటంతో సెంట్రల్ రైల్వే అనూహ్యమైన నిర్ణయం తీసుకొంది. ముంబైలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచేసింది. ప్రయాణికుల కంటే వారిని సాగనంపడానికి లేదా తీసుకువెళ్ళడానికి వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది గనుక రైల్వే స్టేషన్లనీ కిటకిటలాడుతుంటాయి. ముంబైలో మళ్ళీ భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో అనవసరంగా రైల్వే స్టేషన్లకు వచ్చేవారిని తగ్గించేందుకు ప్లాట్‌ఫారం టికెట్ ధరను పెంచినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సుతార్ తెలిపారు. ముంబై రీజియన్‌లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ (ప్రధాన రైల్వే స్టేషన్), దాదార్, లోక్‌సభ ఎన్నికలు మాన్య తిలక్ టెర్మినస్, థానే, కళ్యాణ్, పన్వేల్, భీవాండీ రోడ్ స్టేషన్లలో ప్లాట్‌ఫారం టికెట్ ధరను పెంచినట్లు తెలిపారు. మార్చి 1 నుంచి జూన్‌కు 15వరకు ఈ ధర అమలులో ఉంటుందని తెలిపారు.


Related Post