నేటి నుంచి అంతర్జాతీయ విమానసేవలు షురూ

July 17, 2020
img

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమానసేవలు నేటి నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ముందుగా భారత్‌-అమెరికా, ఫ్రాన్స్ దేశాల మద్య విమానసేవలు ప్రారంభం అవుతాయని కేంద్ర పురవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌ పురి చెప్పారు. ఈ మేరకు ఆ రెండు దేశాలతో ఒప్పందాలు చేసుకొన్నామని చెప్పారు. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు అమెరికాకు చెందిన యునైటడ్ ఎయిర్ లైన్స్ న్యూయార్క్-డిల్లీ, శాన్‌ఫ్రాన్సిస్కో-డిల్లీ మద్య మొత్తం 18 విమానాలను నడుపబోతోంది.  

ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్‌   జూలై 18 నుంచి ఆగస్ట్ 1వరకు 28 విమానాలు నడిపిస్తుంది. త్వరలోనే బ్రిటన్, జర్మనీ దేశాల నుంచి కూడా భారత్‌కు రాకపోకలు మొదలవుతాయని చెప్పారు. అదేవిధంగా భారత్‌కు చెందిన విమానాలు అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు అంతర్జాతీయ విమానాలను నడిపించబోతోందని మంత్రి హర్దీప్ సింగ్‌ పురి చెప్పారు. ఈ నిర్ణయం ఫ్రాన్స్, అమెరికా దేశాలలో చిక్కుకొన్న ప్రవాసభారతీయులకు చాలా సంతోషం కలిగిస్తుందని భావించవచ్చు. 

Related Post