మెట్రో కబుర్లు

May 21, 2018
img

మియాపూర్-అమీర్ పేట-నాగోల్ మద్య మెట్రో రైల్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తరువాత ఎల్&టి, హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థల అధికారులు అమీర్ పేట-ఎల్బి నగర్ కారిడార్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. జూన్ నెలాఖరుకల్లా ఈ మార్గంలో మెట్రో రైల్ సర్వీసులు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు. దానితో పాటు అమీర్ పేట-హైటెక్ సిటీ కారిడార్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ నాటికి ఆ కారిడార్ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఇక వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా జూబ్లీ బస్ స్టాండ్-మహాత్మాగాంధీ బస్ స్టాండ్ కారిడార్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. 

వీటిని పూర్తిచేసేలోపుగానే శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాయదుర్గం వరకు 31 కిమీ కారిడార్, మియాపూర్ నుంచి బి.హెచ్.ఈ.ఎల్-బయోడైవర్సిటీ పార్క్ మీదుగా లక్డీకాపూల్ వరకు 26.2 కిమీ గల మరో రెండు కారిడార్లను కూడా నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ కారిడార్లన్నీ పూర్తయితే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో దాదాపు అన్ని ప్రధానప్రాంతాలు మెట్రో ద్వారా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా బస్టాండులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం కనెక్ట్ అవుతాయి కనుక మెట్రో అత్యంత ప్రాధాన్యత గల, ఉపయోగకరమైన ప్రయాణ సాధనంగా మారే అవకాశం ఉంది.  

Related Post