నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో ‘జైలర్-2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. మొదటి నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని రూ. 800 కోట్లు పైగా కలెక్షన్స్ సాధించింది.
ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది. తెలుగుతో సహా అన్ని భాషల్లో ఒకేసారి అందుబాటులోకి వస్తుందని అమెజాన్ ప్రకటించింది.
జైలర్-2లో రమ్యకృష్ణ, ఎస్.జే. సూర్య, యోగిబాబు, మీర్నా, అన్నారాజన్, జతిన్ సరనా సూరజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ప్రముఖ నటులు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి, వినాయకన్, విజయ్ సేతుపతి అతిధి పాత్రలలో నటించారు.
ఈ సినిమాకు కధ దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్; సంగీతం: అనిరుద్ రవిచందర్; కెమెరా: విజయ్ కార్తీక కన్నం; ఆర్ట్: డిఆర్ కిరణ్; స్టంట్స్: చేతన డిసౌజా; ఎడిటింగ్: ఆర్ నిర్మల్ చేశారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై జైలర్-2 నిర్మించింది.