అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం శర్వానంద్, మాళవిక నాయర్ ప్రధానపాత్రలలో ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నందున ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా సాగింది. ప్రముఖ నిర్మాత, సినీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీగా ధర చెల్లించి డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకు రూ.27 కోట్లు చెల్లించి డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో శర్వా తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్; కెమెరా: జె యువరాజ్; ఎడిటింగ్: అనిల్ పాశాల; స్టంట్స్: దిలీప్ సుబ్రమణియన్; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం చేస్తున్నారు.