విశ్వక్‌ సేన్‌ #కల్ట్ టీజర్‌ లాంచ్ ఈవెంట్ రేపే

February 20, 2026


img

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ కధ, దర్శకత్వంలో వస్తున్న #కల్ట్ టీజర్‌  శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పీసిఎక్స్ లో టీజర్‌ లాంచింగ్ ఈవెంట్ మొదలవుతుంది. సాయంత్రం 4.14 గంటలకు టీజర్‌ విడుదలవుతుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనదలచిన వారు  https://shreyas.media/cl ద్వారా  ఆన్‌లైన్‌లో ఉచితంగా పాసులు పొందవచ్చు.   

ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ నటించడం లేదు. కొంతమంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఇటీవల వియత్నాంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా నేను ఈ కధ తయారు చేశానని విశ్వక్ సేన్ చెప్పారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా తీస్తాము,” అని చెప్పారు. 

ఈ సినిమాకు కధ విశ్వక్‌ సేన్‌, డైలాగ్స్: తరుణ్ భాస్కర్, సంగీతం: రవి బస్రూర్, ఆర్ట్: అరవింద్ మూలే,  చేస్తారు. తారక్ సినిమాస్, వాన్మయి క్రియేషన్స్ బ్యానర్లపై #కల్ట్ సినిమా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష