సుమంత్ అశ్విన్ తో నిహారిక వెడ్డింగ్..!

September 22, 2017


img

టైటిల్ చూసి మెగా డాటర్ నిహారిక ఏంటి సుమంత్ అశ్విన్ ను పెళ్లాడటమేంటని ఆశ్చర్యపోవచ్చు. అయితే వీరిద్దరి హ్యాపీ వెడ్డింగ్ చేసుకునేది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఒక మనసుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు సెకండ్ మూవీ కోసం కొద్దిపాటి గ్యాప్ తీసుకుంది. ఇప్పటికే తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్న నిహారిక ప్రస్తుతం తెలుగులో తన సెకండ్ మూవీని ఫిక్స్ చేసుకుంది. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ పతాకంలో వస్తుంది.

సినిమా ఓ లవ్ స్టోరీతో రాబోతుందట. అయితే ఊహించని విధంగా నిహారిక సుమంత్ అశ్విన్ తో సినిమా చేయడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో అయినా ట్రాక్ ఎక్కేస్తాడేమో చూడాలి. ఈ సినిమాకు హ్యాపీ వెడ్డింగ్ అనే టైటిల్ పెట్టబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని ఏర్పరుస్తుంది. మరి సుమంత్, నిహారిక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష