అఖిల్ ఎందుకయ్యా ఈ ప్రయోగాలు..!

July 25, 2017


img

అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా ఫ్లాప్ అవడంతో కొంత టైం గ్యాప్ తీసుకుని విక్రం కుమార్ తో సినిమా షురూ చేశాడు. సినిమాలో హీరోగా తన పనేదో తాను చేసుకుని పోకుండా టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో వేలు పెడుతున్నాడట అఖిల్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా షూటింగ్ లో కెమెరా ఆపరేట్ చేస్తూ ఉన్న ఒక పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


ఇక ఈ పిక్ చూసి అఖిల్ మీద నెటిజెన్లు విమర్శలు కురిపిస్తున్నారు. బాబు అఖిల్ నీకెందుకయ్యా ఈ ప్రయోగాలు నీ పనేదో నువ్వు చూసుకో అని కామెంట్స్ చేస్తున్నారట. ఏదో సరదాగా సోషల్ మీడియాలో షూటింగ్ స్పాట్ నుండి ఫోటో షేర్ చేస్తే దానికి అఖిల్ కు ఈ రకమైన వింత అనుభవం ఎదురైంది. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా 40 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష