ఉప్పెనకు సుకుమార్ కత్తెరలు

May 22, 2020


img

మెగా మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న తొలి సినిమా ఉప్పెన. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు సుకుమార్ సమర్పకుడిగా ఉన్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించారు. రిలీజ్ కు రెడీ అయినా ఈ సినిమా లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డది. అయితే రిలీజ్ కు టైం దొరకడంతో సినిమాను మరోసారి ఎడిట్ చేస్తున్నారట. 

ఈ సినిమా ఫైనల్ కట్ రెండున్నర గంటలపైనే వచ్చిందని టాక్. అందుకే సుకుమార్ స్వయంగా రంగంలోకి దగ్గర ఉంది ఎడిటింగ్ చేయిస్తున్నాడట. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఉప్పెనతో డైరక్టర్ గా సెటిల్ అవ్వాలని చూస్తున్నాడు. సినిమాకు డిఎస్పీ అందించిన మ్యూజిక్ హైలెట్ గా ఉంటుందట. సినిమా నుండి ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. మరి సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష