మహేష్ బాబు డ్యుయల్ రోలా..?

February 07, 2020


img

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ మరోసారి వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడట.. అంతేకాదు సినిమాలో మహేష్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని అంటున్నారు. మహర్షితో మహేష్ కు మెమరబుల్ సక్సెస్ అందించిన వంశీ పైడిపల్లి ఈసారి ఆ సినిమాను మించిన హిట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట.

అంతేకాదు ఈ సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టర్ గా కామన్ మెన్ గా.. బాషా తరహా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇలాంటి వార్తలతో సినిమాపై బాగా అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ హాలీడే ట్రిప్ లో ఉన్నాడు. అది పూర్తి చేసుకుని రాగానే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తారని టాక్.  Related Post

సినిమా స‌మీక్ష