ట్రిపుల్ ఆర్ లో బాలీవుడ్ భామ..!

January 11, 2019


img

రాజమౌళి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ సినిమాపై రోజుకో వార్త సెన్సేషనల్ గా నిలుస్తుందని తెలిసిందే. బాహుబలి తర్వాత మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిన రాజమౌళి బాహుబలిని మించేలా ఈ మూవీ తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. 

డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పటివరకు హీరోయిన్స్ ఎవరన్నది తేలలేదు. రాజమౌళి ఆలోచనల్లో మాత్రం సినిమాలో హీరోయిన్స్ గా ఒక బాలీవుడ్ భామని తీసుకునే ఛాన్స్ ఉందట. ఇక మరో హీరోయిన్ గా సౌత్ క్రేజీ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటాడని తెలుస్తుంది. మరి ఎవరా ఇద్దరు ముద్దుగుమ్మలు అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఈమధ్యనే కొడుకు పెళ్లి పనుల్లో బిజీ అయిన రాజమౌళి వాటిని ముగించుకుని షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.   Related Post

సినిమా స‌మీక్ష