అఖిల్ ముందే పండుగ తెచ్చేనా..!

November 08, 2018


img

అక్కినేని అఖిల్ కెరియర్ లో ఓ సూపర్ హిట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా అఖిల్, రెండో సినిమా హలో రెండు నిరాశపరచాయి. ప్రస్తుతం అఖిల్ 3వ సినిమా మిస్టర్ మజ్ ను సెట్స్ మీద ఉంది. తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సవ్యసాచి భామ నిధి అగర్వాల్ నటిస్తుంది.

మిస్టర్ మజ్ ను అంటూ టైటిల్ తో పాటుగా నిమిషం పాటు వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది. ముందు డిసెంబర్ 21న క్రిస్ మస్ కానుకగా రిలీజ్ చేయాలని చూడగా అది కాస్త 2019 జనవరికి వాయిదా పడింది. సంక్రాంతి, రిపబ్లిక్ డేకు ఆల్రెడీ బెర్తులు ఖాయం చేసుకోవడంతో అఖిల్ మిస్టర్ మజ్ ను జనవరి మొదటి వారంలో రిలీజ్ ఫిక్స్ చేశారట. మరి సంక్రాంతికి ముందే వస్తున్న అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ ఇంట ముందే పండుగ తెస్తాడా లేడా అన్నది వేచి చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష