తండ్రి హోదాలో బాబాయ్ వచ్చాడు

October 22, 2018


img

ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత సక్సెస్ మీత్ ఆదివారం సాయంత్రం నందమూరి అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. సక్సెస్ మీట్ కు విశిష్ట అతిథిగా నందమూరి బాలకృష్ణ అటెండ్ అవడం ప్రత్యేకత సంతరించుకుంది. కొన్నాళ్లుగా బాబాయ్, అబ్బాయ్ ల మధ్య దూరం అందరికి తెలిసిందే. ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనబడే రోజు కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు అరవింద సమేత సక్సెస్ మీట్ లో ఆ కల నెరవేరింది.

సినిమాకు పనిచేసిన యూనిట్ అందరిని ప్రశంసించిన బాలకృష్ణ తన అన్న నందమూరి హరికృష్ణను గుర్తుచేసుకుంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ పేరు తెచ్చుకున్నారని. ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. ఇక చాలెజింగ్ రోల్స్ అంటే అది మా వంశమే చేయాలని అరవింద సమేతలో ఎన్.టి.ఆర్ పాత్రను ఉద్దేశించి అన్నారు.   

ఎన్.టి.ఆర్ కూడా సినిమాలో నటించిన నటీనటులకు, పనిచేసిన టెక్నిషియన్స్ కూడా ఈ విజయంలో భాగం ఉందని చెప్పాడు. ఇక నాన్న ఉంటే బాగుండేది కాని తండ్రి హోదాలో ఇక్కడకు వచ్చిన బాబాయ్ కు తన ధన్యవాదాలు తెలిపాడు ఎన్.టి.ఆర్. వేడుకలో భాగంగా చిత్రానికి పనిచేసిన టెక్నిషియన్స్, ఆర్టిస్టులకు జ్ఞాపికలను అందచేశారు.Related Post

సినిమా స‌మీక్ష