చి.ల.సౌ టీజర్.. సుశాంత్ కూడా ట్రాక్ ఎక్కేలా ఉన్నాడే..!

July 11, 2018


img

అక్కినేని హీరోలుగా పేరు మోయడమే తప్ప వారికంటూ ఓ సెపరేట్ ఇమేజ్ సంపాదించడంలో వెనుకపడ్డారు సుమంత్, సుశాంత్. అడపాదడపా మామయ్య క్రేజ్ వాడుకున్నా అది కూడా వర్క్ అవుట్ కాలేదు. మళ్లీరావాతో సుమంత్ హిట్ ట్రాక్ ఎక్కేయగా రాబోతున్న సుబ్రమణ్యపురం, ఇదం జగత్ సినిమాలతో సత్తా చాటేలా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు సుశాంత్ వంతు వచ్చింది.

సుశాంత్ హీరోగా యువ హీరో రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా చి.ల.సౌ. సుశాంత్, రుహాని శర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. గ్రూమ్ వర్షన్ అంటూ నెల ముందే చి.ల.సౌ టీజర్ అలరించగా.. లేటెస్ట్ గా బ్రైడ్ వర్షన్ రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరికి కత్రినా కైఫ్ కావాలి కాని ఎవరు రణ్ బీర్ లా ఉండరని హీరోయిన్ అంటుంది. టీజర్ చాలా ప్లెసెంట్ గా అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చూస్తుంటే సుశాంత్ కు ఈ చి.ల.సౌ హిట్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కు సమంతను వాడేస్తున్నారు చిత్రయూనిట్.  

Related Post

సినిమా స‌మీక్ష