శశికళ భర్త మృతి

March 20, 2018


img

మాజీ అన్నాడిఎంకె నేత శశికళ భర్త నటరాజన్ (73) మంగళవారం ఉదయం చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో కనుమూశారు. అయన గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. గత ఏడాది అక్టోబర్ లో మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొన్నారు. రెండు వారాల క్రితం పరిస్థితి విషమించడంతో గ్లోబల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నా కోలుకోలేకపోయారు.

అక్రమాస్తుల కేసులో బెంగలూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అయన భార్య శశికళ నిన్ననే పెరోల్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. భర్త అంత్యక్రియలలో పాల్గొనేందుకు బహుశః ఈరోజు ఆమెకు పెరోల్ లభించవచ్చు. 



Related Post