హైదారాబాద్ శివార్లలో ఫర్నీచర్ పార్క్

August 13, 2019
img

 హైదారాబాద్ శివార్లలో సుమారు 100 ఎకరాలలో ఫర్నీచర్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ప్రకటించారు. స్వీడన్ కు చెందిన ఫర్నీచర్ సంస్థ ఐకియా ఇప్పటికే హైదారాబాద్ లో ఒక భారీ ఫర్నీచర్ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ కూడా ఈ పార్కులో భాగస్వామిగా ఉంటుంది. ఐకీయాకు భారత్ తో సహా దేశవిదేశాలలో ఫర్నీచర్ తయారుచేసి అందించే సంస్థలన్నీ ఆ పార్కులో తమ ఫర్నీచర్ తయారీకేంద్రాలను ఏర్పాటు చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పార్కువలన తెలంగాణ రాష్ట్రంలో ఫర్నీచర్ తయారీ రంగంలో ఉన్న సంస్థలకు, వ్యక్తులకు మంచి గుర్తింపు, వ్యాపారావకాశాలు లభిస్తాయని  జయేష్ రంజన్ అన్నారు. దేశంలో మొట్టమొదటి ఐకియా స్టోరును హైదారాబాద్ లో నెలకొల్పినట్లే, రాష్ట్రంలో శరవేగంగా అభివృధ్ది చెందుతున్న వరంగల్ నగరంలో కూడా ఐకియా స్టోర్ ను ఏర్పాటు చేయాలని జయేష్ రంజన్ ఐకియా సంస్థను కోరారు. 


Related Post