ఆన్‌లైన్‌ నగదు బదిలీలపై ఇక ఛార్జీలు ఉండవు

June 06, 2019
img

సాధారణంగా నిఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో నగదు బదిలీలు, లావాదేవీలు చేసినప్పుడు అన్ని బ్యాంకులు ఆ కొంత రుసుము వసూలు చేస్తుంటాయి. దేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక నుంచి ఆ చార్జీలను రద్దు చేస్తున్నట్లు నేడు ప్రకటించింది. కనుక దేశంలో అన్ని బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు వర్తింపజేయాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది. దీనికి సంబందించి మార్గదర్శకాలను వారం రోజులలోపుగా బ్యాంకులకు తెలియజేస్తామని తెలిపింది. ప్రస్తుతం ఏటీఎం లావాదేవీలపై వసూలు చేస్తున్న ఛార్జీలను కూడా పరిశీలించి సవరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్బీఐ తెలిపింది.  


Related Post