ఐసీసీ ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది

June 27, 2023
img

దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఇవాళ్ళ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్‌ 19వరకు ఈ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. ఈసారి ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ కోసం మొత్తం పది టీమ్స్ పోటీ పడుతున్నాయి. వాటిలో టీమ్‌ ఇండియాకు ఆతిధ్యజట్టు హోదాలో నేరుగానే అర్హత సాధించగా, మరో ఏడు జట్లు సూపర్ లీగ్ నుంచి అర్హత సాధించాయి. మిగిలిన జట్లలో రెండు జింబాబ్వేలో జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో పోటీపడి అర్హత సాధించుకొని ఈ ప్రపంచ కప్‌లో పాల్గొంటాయి. మొత్తం 46 రోజుల పాటు రౌండ్ రాబిన్ పద్దతిలో సాగే ఈ ప్రపంచ కప్ పోటీలలో 45 లీగ్, 3 నాకౌట్ మ్యాచ్‌లు భారత్‌లో 10 చోట్ల జరుగుతాయి. అక్టోబర్ 5న ముందుగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నర్ అప్‌ న్యూజిలాండ్ అహ్మదాబాద్‌లో తొలి మ్యాచ్‌ ఆడతాయి. 

మ్యాచ్ షెడ్యూల్-వేదికలు: Related Post