రాజు గారి గది-2 రివ్యూ & రేటింగ్

October 13, 2017
img

రేటింగ్ : 2.5/5

కథ :

అశ్విన్, కిశోర్, ప్రవీణ్ ముగ్గురు కలిసి ఓ రిసార్ట్ హోటెల్ బిజినెస్ మొదలు పెడతారు. వారు ఏదైతే బంగ్లా తీసుకుంటారో అందులో ఒక ఆత్మ తిరుగుతుంటుంది. ఒకరికి తెలియకుండా ఒకరిని భయపెడుతూ వచ్చిన దెయ్యం ముగ్గురుకి చుక్కలు చూపిస్తుంది. తమ దగ్గర గెస్ట్ గా వచ్చిన నీసా (సీరత్ కపూర్) లో దెయ్యం ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. ఇక చర్చ్ ఫాదర్ నరేష్ సాయంతో రుద్ర (నాగార్జున) దగ్గరకు వెళ్తారు ఈ ముగ్గురు. విషయం తెలుసుకున్న రుద్ర అక్కడకు వచ్చి అందులో ఉన్న ఆత్మ ఎవరిది..? ఎందుకు అక్కడ తిరుగుతుంది..? ఆమె ఏం చేయాలనుకుందో తెలుసుకోవడమే రాజు గారి గది-2 కథ.

విశ్లేషణ :

రాజు గారి గది హిట్ అవడం వల్ల ఆ సినిమా సీక్వల్ టైటిల్ తో అదే రేంజ్ అంచనాలతో ఈ సినిమాకు వస్తారు. అయితే కథకు టైటిల్ కు ఏమాత్రం సంబంధం లేకపోగా సినిమా కథ కథనాలు రొటీన్ పంథాలోనే సాగుతాయి. మొసపోయిన అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అదే బంగ్లాలో కుర్రాళ్లు దిగడం వారిని ఆ దెయ్యం ఏడిపించడం ఇలాంటి కథలు ఈమధ్యనే చాలానే చూశాం. అయితే ఇక్కడ దెయ్యంగా మారిన అమృత పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కేవలం తన బాతింగ్ వీడియో లీక్ అయ్యింది అన్న ఆలోచనతోనే తండ్రిని కోల్పోవడం ఆ తర్వాత తను సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది.

సినిమాలో ఏదైతే బలంగా అనుకున్నారో అది పర్వాలేదు అనిపించుకున్నా సినిమా కామెడీ మాత్రం పండలేదు. మొదటి భాగం పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా సాగుతుంది. సినిమా టైటిల్ కు కన్వే అవ్వకుండా కథనం సాగుతుంది. ఇక భయపెట్టి నవ్వించడం నేర్చుకున్న దర్శకులు అందులో సరైన కథ ఉండేలా జాగ్రత్త పడితే మంచింది. రాజు గారి గది అంచనాలు లేకుండా వచ్చి హిట్ కొట్టగా నాగార్జున, సమంత లాంటి స్టార్ కాస్ట్ ఉన్న రాజు గారి గది-2 అంచనాలను అందుకోలేదు.

సినిమా యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు ఉన్నా సెకండ్ హాఫ్.. క్లైమాక్స్ కాస్త నీరసం తెప్పిస్తాయి. సినిమాకు కనెక్ట్ అయితే కనుక డైలాగ్స్ కు క్లాప్స్ కొట్టేస్తారు. ఇక గ్రాఫిక్స్ కూడా నాసిరకంగా ఉన్నాయనిపిస్తుంది. 

నటన, సాంకేతికవర్గం :

నాగార్జున రుద్రగా అదరగొట్టాడు.. ఓంకార్ అనుకున్న దానికన్నా నాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ క్యారక్టర్ కు కొత్త రూపం వచ్చింది. అయితే ఆ క్యారక్టర్ లో కూడా ముందు చూపించినంత బిల్డప్ తర్వాత కనిపించదు. ఓవరాల్ గా నాగ్ బాగా చేశాడు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా సమంత పాత్ర గురించి మాట్లాడితే అసలు ఆమె చేయాల్సిన పాత్ర కాదు అనుకునేలా ఉన్నా వచ్చిన పాత్ర ఏదైనా సరే సమంత ఇరగదీయడం ఖాయమని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇక అశ్విన్, కిశోర్, ప్రవీణ్ ఏదో అలా చేశారు. సీరత్ కపూర్ హాట్ లుక్స్ తో అదరగొట్టింది. రావు రమేష్, షకలక శంకర్ లు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. 

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. ఓంకార్ డైరక్షన్ స్క్రీన్ ప్లే లో తప్పులు తడకులుగా సాగించాడు. సినిమా కథనం మీద గ్రిప్ కోల్పోయాడనిపిస్తుంది. ఇక దినకరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అబ్బూరి రవి డైలాగ్స్ కు మంచి పేరొస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. మ్యూజిక్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా చేశాడు. పివిపి బ్యానర్లో ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ఒక్కమాటలో :

రాజు గారి గది సీక్వల్ గా వచ్చిన రాజు గారి గది-2 సీక్వల్ అంటూ వచ్చి అంతగా మెప్పించలేదు..! 


Related Post