వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావు’ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కనుక మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వారిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారంటే చాలా భారీ అంచనాలే ఉంటాయి.
వెంకటేష్‌ని సరిగ్గా వాడుకోవాలే కామెడీతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టగలరో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’తో చూపారు. గురూజీ కూడా ఫ్యామిలీ కామెడీ తీయడంలో దిట్ట కనుక వీరిద్దరి కాంబినేషన్‌తో సినిమా మొదలుపెట్టక మునుపే సగం విజయం సాధించేసిందని భావించవచ్చు.
గురూజీ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు తప్పనిసరి కనుక త్రిషకి ఫోన్ చేస్తే ఆమె వెంటనే ఒకే చెప్పేశారట. గతంలో ఆమె వెంకటేష్‌తో చేసిన ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, నమో వెంకటేశాయ, బాడీగార్డు మూడు సూపర్ హిట్లే కనుక ఓకే చెప్పేసే ఉంటారు.
మరో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గురూజీ సినిమాల పేర్లు కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటాయి. కనుక ‘వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అని అనుకుంటున్నట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన చేస్తే క్లారిటీ వస్తుంది.